![]() |
![]() |

'కేజీఎఫ్' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కన్నడ నటుడు యశ్. ఇప్పుడు ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ చాప్టర్ 2'తో అతను మన ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాపై ఉన్న అంచనాలు అసాధారణం. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 78 కోట్ల ప్రి బిజినెస్ చేసింది. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్‌గా పేరుపొందిన రజనీకాంత్ '2.0' మూవీకి మించిన బిజినెస్ ఇది. డబ్బింగ్ సినిమాల్లో ఇది కొత్త రికార్డు.
ప్రాంతీయ భాషా సినిమా కంటే జాతీయ స్థాయిలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషలో సినిమా చేస్తే.. పాపులారిటీ మరింత పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ డబ్బింగ్ సినిమాలతోటి కూడా దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన ఆదరణ పొందవచ్చని బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, పుష్ప సినిమాలు మనకు తెలియజేశాయి. యశ్‌కు ఏమైనా నేరుగా హిందీ సినిమాల్లో చేయాలనే ఆలోచన ఉందా?
ఇదే ప్రశ్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో యశ్‌కు ఎదురైంది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, "ఎందుకండీ.. మన ఆడియెన్స్ నాకు ఇంత గౌరవమిచ్చారు, ఇంత ప్రేమనిచ్చారు. నేనెక్కడకో వెళ్లాలి, అక్కడ సినిమా చెయ్యాలి అని ఎందుకు అనుకోవాలి. ఇక్కడెవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్లను వదిలేసి, అక్కడకు ఎందుకు వెళ్లాలి? ఎక్కడకు వెళ్లినా అదే ఉంటుంది కదా. మొదట్నుంచీ వాళ్లు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ హావింగ్ మోర్ ఆడియెన్స్. మరింత ఎక్కువమందికి నా టాలెంట్ చేరాలి. అంతే కానీ ఇక్కడ వదిలేసి ఎక్కడకో వెళ్లాలని నేను చూడను. ఇవాళ దేశంలో ఎక్కడ కూర్చోనైనా సినిమా తీసి, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. సినిమాల మధ్య భాషపరంగా భేదాలను చూడాల్సిన అవసరం లేదు. అది సినిమా.. అంతే." అని తేల్చేశాడు యశ్.
![]() |
![]() |