![]() |
![]() |

'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ 'అనుపమ పరమేశ్వరన్'.. ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేసే అనుపమ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘బటర్ ఫ్లై’.
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి 'బటర్ ఫ్లై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 18) అనుపమ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే చేతులు కట్టుకుని నిలబడిన అనుపమ, ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నట్లుగా ఉంది. ఆమె వెనుక సీతాకోక చిలుక రెక్కలున్నాయి. ఆ రెక్కల్లో అందమైన రంగులను మనం గమనించవచ్చు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇటీవల 'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ '18 పేజెస్', 'కార్తికేయ-2' సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నిఖిల్ హీరో కావడం విశేషం.
![]() |
![]() |