![]() |
![]() |

'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ, 'క్రాక్' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో #NBK107 సినిమా రెగ్యులర్ షూటింగ్ సిరిసిల్ల టౌన్ (తెలంగాణ)లో ప్రారంభమైంది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రధారులు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొదలుపెట్టారు మేకర్స్. బాలకృష్ణ, ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని గోపీచంద్ రూపొందిస్తున్నాడు.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. రిషీ పంజాబీ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |