![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు టైటిల్ రోల్ లో నటించిన `భరత్ అనే నేను` (2018)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది భామ కియారా అద్వాని. మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ మెమరబుల్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ`(2019)లో కనువిందు చేసింది. అయితే, `భరత్ అనే నేను` తరహాలో ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్ అనిపించుకోలేకపోయింది. కట్ చేస్తే.. మూడేళ్ళ అనంతరం మరో తెలుగు సినిమాలో నటిస్తోంది కియారా అద్వాని. ఇందులోనూ రామ్ చరణ్ కి జోడీగా ఎంటర్టైన్ చేయనుందీ ముద్దుగుమ్మ.
Also Read: ఆ ఇద్దరు హీరోలే నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు!
సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా, `#RC 15` అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ మెగా మూవీ.. రాజకీయాల నేపథ్యంలో సాగనుందని సమాచారం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కియారా ఫస్ట్ టాలీవుడ్ వెంచర్ `భరత్ అనే నేను` కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీనే. మరి.. మరోసారి కియారాకి రాజకీయ నేపథ్యం కలిసొస్తుందేమో చూడాలి.
Also Read: భీమ్లా నాయక్.. విడుదలకు వారం ముందు షూటింగ్ పూర్తి!
ఇదిలా ఉంటే, స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. 2023 సంక్రాంతికి సందడి చేయనుందని బజ్.
![]() |
![]() |