![]() |
![]() |

ఆమె.. మెగాస్టార్ చిరంజీవికి సతీమణి. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు మాతృమూర్తి. తన ఇంట్లోనే ఇద్దరు స్టార్లను కలిగివున్న ఆమె.. సురేఖ! ఆమె అంటే మెగా ఫ్యామిలీ మొత్తానికీ ఆరాధ్య భావం ఉంది. చిరు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ సైతం ఆమెపై తల్లి అంజనాదేవి తర్వాత అంత భక్తినీ, ప్రేమనూ కనపరుస్తుంటారు. తల్లి అంటే చరణ్‌కు విపరీతమైన ప్రేమ. ఈరోజు సురేఖ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఒక చక్కని ఫొటోను షేర్ చేసి, అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు చరణ్. 'ఆచార్య' సెట్స్‌పై తండ్రి చిరంజీవి, తల్లి సురేఖతో కలిసున్న ఫొటోను షేర్ చేసి, "నేనేమిటనేది నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు!! హ్యాపీ బర్త్‌డే అమ్మా" అని ఆయన రాసుకొచ్చాడు. ఆ ఫొటోలో ఒక భర్త, మరోవైపు కుమారుడు నిల్చొని వుండగా, నవ్వులు చిందిస్తున్నారు సురేఖ. మగవాళ్లిద్దరూ నక్సలైట్ల పాత్రల్లో ఆలివ్ దుస్తుల్లో కనిపిస్తున్నారు.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి.

![]() |
![]() |