![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ - ఇండియా మూవీస్ లో `ఆదిపురుష్` ఒకటి. ప్రభాస్ కెరీర్ లో తొలి మైథలాజికల్ మూవీగా ఈ సినిమా అలరించనుంది. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో `ఆదిపురుష్`పై సర్వత్రా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు `ఆదిపురుష్`కి సంబంధించి ఎలాంటి ప్రచార హంగామా చేయని యూనిట్.. జూలై నుంచి ఈ పర్వానికి శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఇందులో భాగంగా జూలై 27న కృతి సనన్ పుట్టినరోజు సందర్భంగా `జానకి` ఫస్ట్ లుక్ ని, ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే స్పెషల్ గా `లంకేశ్` ఫస్ట్ లుక్ ని రివీల్ చేయనున్నారట. ఇక డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న `రాఘవ` లుక్ ని విడుదల చేయనున్నారట. ఆపై నవంబర్, డిసెంబర్ లో టీజర్, ట్రైలర్ తో సందడి చేయనున్నారని టాక్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |