![]() |
![]() |

తమ అభిమాన హీరో సినిమా కోసం ఆ హీరో అభిమానులు ఎదురుచూస్తుండం సహజం. కానీ ప్రేక్షకులు ఆ హీరో అభిమానుల కంటే ఎక్కువగా ఎదురుచూస్తుంటే మాత్రం అది దేవర(devara) కోసమే అని చెప్పవచ్చు. ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించిన దేవర ఎన్టీఆర్ (ntr)నటన లో దాగి ఉన్న ఇంకో కొత్త కోణాన్ని పరిచయం చేయబోతుంది. కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న దేవరకి సంబంధించిన ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ ని తెస్తుంది.
ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి అవుతున్న దేవర నుంచి ఈ రోజు సాయంత్రం సరిగ్గా 4:05 నిమిషాలకి దేవర గ్లింప్స్ రిలీజ్ కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర సంబరాలు స్టార్ట్ అయ్యాయి.అలాగే ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీ లో మూవీ గ్లింప్స్ కి సంబంధించి ఉన్న రికార్డులన్ని కూడా మరుగున పడిపోవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవరలో ఎన్టీఆర్ సరసన శ్రేదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (janhvi kapoor) హీరోయిన్ గా చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, ఆర్ ఆర్ ఆర్ ఫేమ్ షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
![]() |
![]() |