![]() |
![]() |

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు ఉంటే వాటిని ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ లో తొలగిస్తున్నారు. దాంతో పాటుగా ఆయా వాహనాల యజమానుల నుంచి జరిమానాలు కూడా వసూలు చేస్తున్నారు. ఆ విధంగా మొన్నా మధ్య యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారును జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేసిన పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను అక్కడికక్కడే తొలగించారు. ఆపై జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. ప్రతి రోజూ నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ పలువురి ప్రముఖుల కార్ల బ్లాక్ ఫిల్ములు తొలగించారు.
కాగా.. తాజాగా సోమవారం మాటల మాంత్రికుడు, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారును ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తో తిరుగుతూ దొరికిపోయారు. జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా త్రివిక్రమ్ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బ్లాక్ ఫిల్మ్ తొలగించడమే కాకుండా.. జరిమానా కూడా విధించారు.
ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో అనేక వాహనాలతో పాటుగా టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగించి, జరిమానాలు విధించడం విశేషం. కార్లకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదని సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పలువురు సెలబ్రిటీలు ప్రైవసీ పేరుతో బ్లాక్ ఫిల్మ్ లతో నగరంలో వాహనాలు వినియోగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
![]() |
![]() |