![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో పలు మల్టిస్టారర్ మూవీస్ వచ్చాయి. వాటిలో సింహభాగం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి చిత్రాల్లో 1950 నాటి 'సంసారం' ఒకటి. దిగ్గజ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో రామారావు, నాగేశ్వరరావు అన్నదమ్ములుగా నటించగా.. యన్టీఆర్ కి జంటగా లక్ష్మీరాజ్యం, ఏయన్నార్ కి జోడీగా పుష్పలత నటించారు. కె.వి. కృష్ణ, సీవీ రంగనాథ దాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మల్టిస్టారర్ కి సుసర్ల దక్షిణామూర్తి స్వరాలు సమకూర్చారు. 1950 డిసెంబర్ 29న విడుదలైన 'సంసారం' నేటితో 70 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
'సంసారం' - కొన్ని ఆసక్తికరమైన అంశాలు:
* యన్టీఆర్, ఏయన్నార్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. 1950లోనే వీరిద్దరి కలయికలో రూపొందిన మొదటి చిత్రం 'పల్లెటూరి పిల్ల' విడుదలైంది. ఈ రెండు చిత్రాలు కూడా ఘనవిజయం సాధించడం విశేషం.
* తమిళంలో 'సంసారం' పేరుతోనూ, హిందీలో 'సంసార్' టైటిల్ తోనూ, మలయాళంలో అయోధ్య శీర్షికతోనూ 'సంసారం' రీమేక్ అయింది.
* 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న 'సంసారం'.. మద్రాస్ లో 224 రోజులు ప్రదర్శితమై అప్పట్లో సంచలనం సృష్టించింది.
![]() |
![]() |