Home  »  News  »  హాట్‌ న్యూస్‌: ఆ ఏడూ ఓటీటీలోకి!

Updated : Jun 29, 2020

ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్‌ నడుమ పోటీ వాతావరణం ఏ విధంగా ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం ఏడు సినిమాలు జ్యోతిక ‘పొన్‌ మగల్‌ వంధల్‌’, హిందీ సినిమాలు అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాల ‘గులాబో సితాబో’, విద్యా బాలన్‌ ‘శకుంతలా దేవి’, కీర్తీ సురేశ్‌ ‘పెంగ్విన్‌’, కన్నడ సినిమాలు ‘లా’, ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’, మలయాళ సినిమా ‘సుఫియాం సుజాతాయం’ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ఘనంగా ప్రకటించింది. ఇందులో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ఇప్పుడు డిస్నీహాట్‌స్టార్‌ వంతు వచ్చింది.

జూలై నుండి అక్టోబర్‌ మధ్య బాలీవుడ్‌ స్టార్స్‌ నటించిన క్రేజీ సినిమాలు ఏడింటిని డిస్నీప్లస్‌హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అందులో అక్షయ్‌కుమార్‌ ‘లక్ష్మీ బాంబ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘భుజ్‌’, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌ తదితరులు నటించిన ‘సడక్‌–2’, దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘దిల్‌ బేచారా’, అభిషేక్‌ బచ్చన్‌ కొంత గ్యాప్‌ తర్వాత యాక్ట్‌ చేసిన ‘ద బిగ్‌ బుల్‌’, విద్యుత్‌ జమాల్‌ ‘ఖుదా హాఫిజ్‌’, మరో సినిమా ‘లూట్‌ కేస్‌’ ఉన్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘దిల్‌ బేచారా’ జూలై 24న ఓటీటీలోకి వస్తోంది. తరవాత మిగతా సినిమాలు విడుదల కానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ సౌత్‌ సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తే... బాలీవుడ్‌ సినిమాలకు మాత్రమే డిస్నీ హాట్‌స్టార్‌ ఇంపార్టెన్స్‌ ఇచ్చింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.