![]() |
![]() |

సీనియర్ పోస్టర్ డిజైనర్, డైరెక్టర్ మస్తాన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొవిడ్‌తో పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. 42 సంవత్సరాల కెరీర్‌లో కన్నడ చిత్రసీమలో మస్తాన్ 2 వేలకు పైగా చిత్రాలకు పోస్టర్ డిజైనర్‌గా పనిచేసి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారిన ఆయన 'శుక్లాంబరధరమ్', 'కలేసి మల్లేసి', 'సితార' చిత్రాలను రూపొందించారు.
కొవిడ్-19 కారణంగా మస్తాన్ మృతి చెందారనే వార్త శాండల్‌వుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్నేహితులు, సన్నిహితులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడు రోజుల వ్యవధిలో కరోనా కారణంగా చనిపోయిన రెండో సెలబ్రిటీ మస్తాన్. ఏప్రిల్ 18న నటుడు, నిర్మాత డాక్టర్ డి.ఎస్. మంజునాథ్ మృతి చెందారు.
![]() |
![]() |