![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. `మురారి`, `అతడు`, `దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`.. ఇలా కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిన మహేశ్ చిత్రాలు సింహభాగం విజయపథంలో పయనించాయి. అయితే, గత కొంతకాలంగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ వైపు మొగ్గు చూపిస్తూ.. ఈ జోనర్ కి కాస్త దూరమయ్యారు సూపర్ స్టార్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సర్కారు వారి పాట` కూడా సోషల్ మెసేజ్ ఉన్న మూవీనే.
కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ మాత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మరో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. మే 31న ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్. కాగా, `అత్తారింటికి దారేది` తరహాలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మహేశ్, త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ ఉండబోతోందని వినికిడి. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |