![]() |
![]() |

'ఆర్ ఆర్ ఆర్'తో పాన్ - ఇండియా స్టార్ అయిపోయాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ నేపథ్యంలో.. అతని తదుపరి చిత్రం 'ఆచార్య'పైనే అందరి దృష్టి ఉంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో మరో హీరోగా ఎంటర్టైన్ చేయనున్నాడు చరణ్. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలోనూ ఒకే ఏడాదిలో రామ్ చరణ్ రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భాలున్నాయి. 2013లో `నాయక్`, `జంజీర్`.. 2014లో `ఎవడు`, `గోవిందుడు అందరివాడేలే` చిత్రాలతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో రెండేసి సినిమాలతో సందడి చేశాడు చరణ్. అయితే, ఆయా సంవత్సరాల్లో మొదటగా రిలీజైన సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ విన్నర్స్ అనిపించుకోగా.. సెకండ్ రిలీజెస్ మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ క్రమంలో.. `ఆర్ ఆర్ ఆర్` తరువాత వస్తున్న `ఆచార్య`తోనైనా చరణ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
కాగా, విజనరీ కెప్టెన్ కొరటాల శివ రూపొందించిన `ఆచార్య`లో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.
![]() |
![]() |