![]() |
![]() |

నేచురల్ స్టార్ నానికి కెరీర్ ఆరంభంలో నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో `రైడ్` ఒకటి. తన మొదటి సినిమా `అష్టా చమ్మా`లో అవసరాల శ్రీనివాస్ తో కలిసి వినోదాలు పంచిన నాని.. రెండో చిత్రం `రైడ్`లో మరో యంగ్ హీరో తనీశ్ తో కలిసి ఎంటర్టైన్ చేశారు. నానికి జోడీగా అక్ష, తనీశ్ కి జంటగా శ్వేత బసు ప్రసాద్ నటించిన ఈ సినిమాని రమేశ్ వర్మ డైరెక్ట్ చేయగా.. బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. కథానాయకులుగా నాని, తనీశ్ కి.. దర్శకుడిగా రమేశ్ వర్మకి.. తెలుగునాట నాయికలుగా అక్ష, శ్వేతకి ఇదే రెండో సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంతో ప్రముఖ గాయకుడు హేమచంద్ర సంగీత దర్శకుడిగా అవతారమెత్తారు. పాటల్లో ``దంచవే మేనత్త కూతురా`` (రీమిక్స్)కి మంచి మార్కులు పడ్డాయి. `మంగమ్మ గారి మనవడు` (1984)లో
నటసింహ నందమూరి బాలకృష్ణ, సుహాసినిపై చిత్రీకరించిన ``దంచవే`` గీతాన్ని.. పాతికేళ్ళ తరువాత `రైడ్` కోసం నాని, అక్షపై రీమిక్స్ రూపంలో పిక్చరైజ్ చేశారు. 2009 జూన్ 5న విడుదలై విజయం
సాధించిన `రైడ్`.. నేటితో 12 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |