![]() |
![]() |
.jpg)
ఇటీవల రామ్‌గోపాల్ వర్మ 'స్పార్క్' అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఇటీవల లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను పెట్టారు. వాటిలో ఎంపిక చేసినవాటిని స్పార్క్‌లో జూన్ 5న పబ్లిష్ చేస్తామని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఏకంగా ఈ కాంటెస్ట్‌కు 8 వేల షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయంట. వాటన్నింటినీ వడపోసి, విన్నర్స్‌ను ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతోంది కాబట్టి, జూన్ 20 దాకా టైమ్ తీసుకొని ఆ రోజు ఎంపిక చేసిన షార్ట్ ఫిలిమ్స్‌ను స్పార్క్‌లో స్ట్రీమింగ్ చేస్తామని ఆర్జీవీ ప్రకటించారు.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆయన వెల్లడించారు. తనదైన స్టైల్‌లో, "నమ్మండి లేదా సొమ్మసిల్లి పడిపోండి.. స్పార్క్ షార్ట్ ఫిలిమ్స్ కాంటెస్ట్‌కు 8 వేల ఫిలిమ్స్ వచ్చాయి. వాటిలో చాలావరకు టెర్రిబుల్‌గా ఉన్నాయి, కొన్ని భరించగలిగేలా ఉన్నాయి, మరికొన్ని చూడదగ్గవిగా ఉన్నాయి, చాలా తక్కువ సంఖ్యలో చాలా బాగున్నాయి. పోటీకి చాలా ఎక్కువ సంఖ్యలో ఫిలిమ్స్ వచ్చినందున, వాటన్నింటినీ చూసి ఎంపిక చేయడానికి టైమ్ ఎక్కువ పడుతుంది కాబట్టి, 15 రోజులు పోస్ట్‌పోన్ చేసి, పబ్లిషింగ్ డేట్‌ను జూన్ 20గా నిర్ణయించాం." అని ఆయన రాసుకొచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ, ఆర్జీవీ ఫాలోయర్ ఒకరు చేసిన కామెంట్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఆయన కాంటెస్ట్‌కు వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ గురించి ఏదైతే కామెంట్ చేశాడో, సరిగ్గా అదే కామెంట్‌ను ఆయన సినిమాలకు అన్వయిస్తూ కామెంట్ చేశాడు ఆ నెటిజన్. 'చంద్రగిరి సుబ్బు యూట్యూబర్' అనే ఐడీ నేమ్‌తో ఉన్న ఆ ఫాలోయర్, "మీ ఫీచర్ ఫిలిమ్స్ తరహాలోనే.. కొన్ని టెర్రిబుల్, మరికొన్ని బేరబుల్, తక్కువసంఖ్యలో వాచబుల్" అని కామెంట్ చేశాడు.

![]() |
![]() |