యువకుడి ఆత్మహత్యకు రివెంజ్.. యువతిపై సామూహిక అత్యాచారం
on Apr 27, 2022
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. నిందితుల నుంచి యువతికి సంబంధించిన 26 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పన్నెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో పధ్నాలుగు వీడియోలు నిందితుల మొబైల్స్ లో ఉన్నట్లు చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. బాధితురాలిని ప్రేమ పేరిట వేధింపులకు గురి చేశాడు. ప్రేమించాలని వెంట పడ్డాడు. కానీ అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సదరు యువకుడు గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు ఈ యువతే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు కక్ష కట్టి ఈ ఏడాది జనవరిలో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆమె జుట్టు కత్తిరించి, ముఖానికి బ్లాక కలర్ పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



