మహరాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఏనుగుల మంద
on Oct 26, 2024
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా ప్రస్తుతం మరో ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు. ఆసిఫాబాద్ అడవుల్లో ఉన్నఈ ఏనుగుల మంద జనవాసాల్లోకి ఏ క్షణాన అయినా రావొచ్చు. మహారాష్ట్ర నుంచి బయలు దేరిన ఈ ఏనుగుల మంద తెలంగాణలోని ఆసిఫాబాద్ అడవుల్లో ప్రవేశించాయి. పంట పొలాల్లోకి ఏనుగుల మంద ప్రవేశించే అవకాశం ఉండటంతో గత రాత్రి నుంచి రైతులు, ప్రజలు జాగారం చేస్తున్నారు. మహారాష్ట్ర లోని గడ్చి రోలి జిల్లా నుంచి భారీ ఏనుగుల మంద ఆసిఫాబాద్ అడవుల్లోకి ప్రవేశించాయి. గత ఏడాది ఇద్దరు ఆసిఫాబాద్ రైతులను తొక్కి చంపిన మగ గజరాజు తప్పించుకుని తిరిగి మహరాష్ట్ర వెళ్లిపోయింది. అదే గజరాజు ఈ ఏనుగుల మందను తీసుకొచ్చిందని ఆటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ ఏనుగుల మంద ప్రవేశిస్తే భారీ నష్టం సంభవించవచ్చు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
