Read more!

English | Telugu

భర్తని వదిలేసి అమెరికాకి వెళ్తున్న శివజ్యోతి!

శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది.

తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది..

తాజాగా శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరు అని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. 

శివజ్యోతి ఎప్పుడూ ఈవెంట్స్ లో బిజీగా ఉంటుంది.  అయితే శివజ్యోతి తాజాగా ఒక ఈవెంట్ కోసం అమెరికాకి వెళ్ళింది. అమెరికా వెళ్తూ తన భర్త గంగూలీని వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదని, మొదటిసారి అమెరికా  వెళ్తున్నా అని చెప్పి ఎయిర్ పోర్ట్ లో  తన భర్తని హగ్ చేసుకొని  ఏడ్చేసింది. కాగా ఇలా శివజ్యోతి ఏడుస్తున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేసింది. 'మై హ్యాపీ  ప్లేస్.. ఐ మిస్డ్  సో మచ్' అనే కాప్షన్ తో ఈ  పోస్ట్ ని షేర్ చేసింది శివజ్యోతి. మొదటి నుండి తను ఎమోషనల్ పర్సన్. అలాంటిది మొదటిసారి తన భర్తని వదిలేసి వెళ్తున్నందుకు తను ఇంకా ఎమోషనల్ అవడంతో.. ఈ వీడీయోని చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు‌. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.