Read more!

English | Telugu

గౌతమ్ గురించి నీ భార్య అంతలా అడుగుతుందేంటి?

స్టార్ మా‌ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-110 లో.. మొదట కంగారుగా వెళుతున్న కృష్ణని రేవతి ఆపి.. తన చేతితో బ్రేక్ ఫాస్ట్ తినిపిస్తుంది. ఆ తర్వాత భవానీ తన గదిలో నందు ఆరోగ్యం గురించి కృష్ణ కేరింగ్ ని తప్పు పట్టాలా లేక నా కూతురికి గతం గుర్తువచ్చిందని బాధపడాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ కోసం మురారి వెతికి తను వెళ్ళిపోయిందని తెలిసి ఇంటి నుండి బయటకు వచ్చి, కార్ దాకా వస్తాడు. అప్పుడే మురారిని ఫాలో చేస్తూ కార్ దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తుంది ముకుంద. ఇక నుండి రోజు నేను ఇలాగే హ్యాపీగా కార్ డోర్ తీస్తాను.. నీకు బై కూడా చెప్తాను. ఎందుకంటే కృష్ణ వెళ్ళాక మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని ముకుంద అంటుంది‌. దానికి సమాధనంగా.‌ "కృష్ణ వెళ్ళిపోయి నేను, ఆదర్శ్ వెళ్ళిపోయి నువ్వు.. ఇద్దరం ప్రేమ ప్రపంచంలో విహరిస్తే లోకం నీకు ఏ పేరు పెడుతుందో.. నీ ఊహకే వదిలేస్తున్నా" అని ముకుందతో చెప్పేసి మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 

గౌతమ్ కోసం కృష్ణ హాస్పిడల్ కి వెళుతుంది. అక్కడ అతని క్యాబిన్ లో చూడగా గౌతమ్ ఉండడు. ఆ తర్వాత గౌతమ్ టేబుల్ మీద ఉన్న ఫోటోని చూస్తుండగా.. ఎవరో తనని ముట్టుకున్నట్టుగా ఒక్కసారిగా అనిపించేసరికి ఉలిక్కిపడి ఆ ఫోటోని చూడకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. కృష్ణని ముట్టుకుంది మురారి అని తెలుసుకొని షాక్ అవుతుంది. "మీరా.. మీరు ఇక్కడికి వచ్చారేంటి" అని కృష్ణ అడుగుతుంది. "నువ్వెవరికి చెప్పకుండా వచ్చిన పని ఇదా.. అసలు ఏమైంది నీకు" అని మురారి అడుగుతాడు. గౌతమ్ సర్ ని కలవడమే ఇంపార్టెంట్ అని కృష్ణ అంటుంది. "అసలు నీకేమైంది. మాటకి ముందొక గౌతమ్ సర్.. మాట తర్వాత ఒక గౌతమ్ సర్" అని మురారి అంటాడు. ఇప్పడేమంటారు ఏసీపీ సర్ అని కృష్ణ అరిచేసరికి.. మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 

ఆ తర్వాత ముకుంద ఒక్కతే బాధపడుతుంది. చివరికి గెలిచేది ప్రేమే.. మన ప్రేమ శాశ్వతం‌ అని మురారి గురించి ఆలోచిస్తుంది ముకుంద. పరిమళ మేడమ్ వస్తుంది. "గౌతమ్ సర్ రాలేదు మేడమ్.. ఒకసారి కాల్ చేస్తారా? ఎప్పుడు వస్తారు? నాకు పిచ్చెక్కిపోతుంది మేడమ్" అని పరిమళ డాక్టర్ తో కృష్ణ అడుగుతుంది. "అసలు నీకెలా కనిపిస్తున్నాను. అందరి అడ్రెస్ లు నా దగ్గర పెట్టుకుంటానా, అసలు ఏంటి నీ ప్రాబ్లం" అని కృష్ణతో పరిమళ అంటుంది. ఆ అడ్రెస్ లేని మనిషితో నీకెంటి? అసలు ఎందుకు నువ్వింత టెన్షన్ పడుతున్నావని పరిమళ కృష్ణని అడిగినా తను సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది.

ఆ తర్వాత పరిమళ డాక్టర్ మురారికి కాల్ చేస్తుంది. "కృష్ణ గురించి పట్టించుకుంటున్నావా?. పిచ్చిపట్టినట్టుంది. సీనియర్ డాక్టర్ గౌతమ్ గురించి నీ భార్య అంతలా అడుగుతుందేంటి" అని పరిమళ అడిగేసరికి.. "నీకు నా భార్య మీద‌ అనుమానమా?" అని మురారి అడుగుతాడు. "నీకు ఇంకా అర్థం కాలేదా? నీ సంసారం నువ్వు చక్కదిద్దుకో" అని మురారితో పరిమళ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.