English | Telugu
Karthika Deepam2 : దీపని కత్తితో పొడిచేసిన రౌడీ.. కార్తీక్ చూసి షాక్!
Updated : May 7, 2025
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -350 లో....జ్యోత్స్న గౌతమ్ ని కలుస్తుంది. మన పెళ్లి జరగదు. ఆ దీప మనల్ని వదిలి పెట్టదు. అందుకే ఇప్పుడే ఆపేద్దాం అంటున్నానని జ్యోత్స్న కావాలనే గౌతమ్ ని రెచ్చగొడుతుంది. అంటే ఇప్పుడు ఆ దీప లేకుంటే నీకు ఒకే కదా.. ఆ దీప పని చెప్తాను శాశ్వంతంగా లేకుండా చేస్తానని గౌతమ్ అంటుంటే అలా చంపడాలు అంటే నాకు భయం ఒకసారి ఆలోచించమని జ్యోత్స్న నటిస్తుంది. నువ్వు త్వరలోనే గుడ్ న్యూస్ వింటావ్.. ఆ తర్వాత మన పెళ్లి అని గౌతమ్ అంటాడు.
మరొకవైపు నువ్వు జైలు నుండి బయటకు వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాం. అందరు రెడీ అవ్వండి అని కార్తీక్, దీపలతో అనసూయ అంటుంది. నాకు వర్క్ ఉందని కార్తీక్ అంటాడు. లేదు అందరం వెళ్ళాలని కాంచన అంటుంది. సరే మీరు ముందు వెళ్లి ఏర్పాట్లు చెయ్యండి.. దీప, నేను తర్వాత వస్తామని కార్తీక్ అంటాడు. సరే అని వాళ్ళు వెళ్తారు. మరొకవైపు శివన్నారాయణకి రెస్టారెంట్ నుండి ఫోన్ వస్తుంది. సీఈఓ అక్కడే ఉంది కదా అంటాడు. లేదని వాళ్ళు చెప్తారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్లావని శివన్నారాయణ అడుగుతాడు. గౌతమ్ దగ్గరికి కి అని పారిజాతం ఇరికిస్తుంది. గౌతమ్ అంటే ఇష్టం లేనిదే తనని వెళ్లి కలుస్తుందా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అని పారిజాతం కావాలనే అంటుంది.
నువ్వేమంటావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. ఇక ఏం చెయ్యలేక జ్యోత్స్న సరే అంటుంది. ఆ తర్వాత దీప రెడీ అవుతుంటే కార్తీక్ జడలో మల్లెపూలు పెడుతాడు. ఇద్దరు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కార్తీక్ వెళ్లి సైకిల్ దగ్గరికి వెయిట్ చేస్తుంటాడు. దీప డోర్ వేస్తుంటే రౌడీ వచ్చి కత్తితో దీపని పొడిచి వెళ్ళిపోతాడు. ఇంకా దీప రావడం లేదని కార్తీక్ వెళ్తాడు. దీపని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
