Read more!

English | Telugu

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో ఊహించని మలుపు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1064 లో..‌ మను తప్పు చేసే మనిషి కాదు అతన్ని నా కొడుకుగా చేసుకుందాం అనుకున్నాను కానీ చివరి నిమిషంలో ఇలా జరిగింది. నాకు అదృష్టం లేదమోనని మహేంద్ర అంటాడు. కానీ మనుని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది.. మీరేం కంగారు పడకండి అంటూ అనుపమ వాళ్ళకి మహేంద్ర ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత వసుధార.. రిషి ఫోటో పట్టుకొని మను కూడా మీ నాన్న కొడుకంట. ఈ విషయం మను, మావయ్యకి తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వసుధార ఆలోచిస్తు పడుకుంటుంది. అప్పుడే రాజీవ్ నీడ తనపై పడుతుంది. ఒక్కసారిగా లేచి ఎవరంటు బయటకు వస్తుంది. కానీ ఎవరు ఉండరు.

ఆ తర్వాత మహేంద్ర, అనుపమ ఇద్దరు.. ఎవరు అంటూ బయటకు వస్తారు. ఎవరు లేరు అమ్మ.. నువ్వు వెళ్లి పడుకో అని మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత అనుపమ, వసుధార ఇద్దరు గదిలోకి వెళ్తారు. మరుసటి రోజు  ఉదయం మహేంద్ర, అనుపమ, వసుధారలు మను దగ్గరికి లాయర్ ని తీసుకొని వెళ్తారు. అన్ని సాక్ష్యాలు కూడా మీరు తప్పు చేసాయని చూపిస్తున్నాయి. మీకు బెయిల్ రావడం కష్టమని ఆ లాయర్ చెప్తాడు..ఆ తర్వాత మను దగ్గరికి.. నాన్న మను అంటూ అనుపమ ఎమోషనల్ గా వస్తుంటుంది. మను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు.. కోర్టుకి తీసుకొని వెళ్ళాలంటూ మనుని తీసుకొని వెళ్తుంటే.. మను ఫేస్ లో స్మైల్ చూసి, ఆ చిరునవ్వు ఎప్పటికి అలాగే ఉండేలా చెయ్యాలని మహేంద్ర అంటాడు. అప్పుడే రాజీవ్ ఎవరితోనో మాట్లాడుతుంటే వసుధార చూసి.. మావయ్య రాజీవ్ చూడండి అని అనగానే అక్కడ రాజీవ్ ఉండడు. నువు ఎదో కంగారులో ఉన్నావ్ అమ్మ అని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత అనుపమ, వసుధారలు ఇంటికి వచ్చాక దేవయాని వస్తుంది.. మీరు ఎందుకు వచ్చారు మాటలతో హింసిచాడానికి వచ్చారా అంటు దేవయానిని వసుధార అడుగుతుంది. మను తప్పు చేసాడు.. ఏ నేరం చెయ్యకపోతే సాక్ష్యాలు ఎందుకు ఉంటాయని దేవయాని అంటుంది. పెద్ద పెద్ద యుద్దాలు ఆడవాళ్ల కోసం జరుగుతాయని అంటారు కదా నీ కోసం మను, రాజీవ్ కి మధ్య గొడవ జరిగిందేమోనని.. వసుధరపై మను మనసు పడ్డాడని రాజీవ్ కి అనిపించిదేమోనని  దేవయాని అంటుంది. దాంతో దేవయాని మీదకి అనుపమ చెయ్యి ఎత్తుతుంది. ఆ తర్వాత ఇలా మాట్లాడితే బాగోదని వార్నింగ్ ఇస్తుంది అనుపమ. మరొకవైపు దేవయానిపై ఫణీంద్ర చాలా కోపంగా ఉంటాడు. దేవయాని వెళ్ళగానే.. ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతాడు.. ఆ తర్వాత దేవయాని మాట్లాడిన మాటలన్నీ వసుధార వీడియో తీసి.. ఫణీంద్రకి పంపిస్తుంది. ఆ వీడియో చూపిస్తూ ఎందుకలా మాట్లాడావని అడుగుతాడు. నేనేం తప్పుగా మాట్లాడానని దేవయాని అనగానే.. శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తాడు ఫణింద్ర. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.