Read more!

English | Telugu

Guppedantha Manasu : మనుని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇదంతా వాడి ప్లానేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1060 లో.. మేమ్ కూడా దత్తత కార్యక్రమానికి వస్తామని శైలేంద్ర అనగానే.. మీరు రానని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వస్తానంటున్నారని ధరణి అడుగుతుంది. నువ్వు ముందు వెళ్లి రెడీ అవ్వు అంటూ ధరణిని శైలేంద్ర పంపిస్తాడు. వద్దంటే వెళదామని అంటున్నావేంటని దేవయాని అంటుంది. వెళదాం మమ్మీ ఆ దత్తత జరగదని శైలేంద్ర అంటాడు..

ఆ తర్వాత దత్తత కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. దేవయాని దత్తత ఏంటి అంటూ చిరాకుపడుతుంది..ఏంటి శైలేంద్ర దత్తత జరగదు అన్నావని దేవయాని అడుగుతుంది.. కాసేపు వెయిట్ చెయ్ అంటూ శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత మనుకి వసుధార ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ కలవదు‌. అనుపమ కూడా చేస్తుంది కానీ ఫోన్ కలవదు. దాంతో మహేంద్ర టెన్షన్ పడుతుంటే.. చూసావా మమ్మీ వాళ్ళు ఎలా టెన్షన్ పడుతున్నారోనని శైలేంద్ర అంటాడు. అసలు తనని దత్తత తీసుకుంటున్నట్లు తనకి అయిన చెప్పారా అని దేవయాని అంటుంది. చెప్పకుండా ఎలా ఉంటాం ముహూర్తం టైమ్ కి వస్తాడని మహేంద్ర చెప్తాడు. నాకు బానే సమాధానం చెప్తారు కానీ అసలు దత్తత అతనికి ఇష్టం ఉందో లేదోనని దేవయాని అంటుంది. దాంతో ఫణీంద్ర తనపై కోప్పడతాడు. ఆ తర్వాత కాసేపటికి మను వస్తాడు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. రూమ్ కి వెళ్లి కొత్త బట్టలు మార్చుకొని రమ్మని మహేంద్ర పంపిస్తాడు. వచ్చినందుకు థాంక్స్ అంటూ వసుధార చెప్తుంది.. ఆ తర్వాత  ఏంటి రాడన్నావ్ కదా అని శైలేంద్రని దేవయాని అడుగుతుంది. వస్తే ఏంటి? ఈ కార్యక్రమం జరగదని శైలేంద్ర అంటాడు.

ఆ తర్వాత మను వచ్చి పీటలపై కూర్చొని ఉంటాడు. మహేంద్ర కూడ కుర్చుంటాడు.. పంతులు పూజ మొదలు పెడతాడు.. దత్తత ఇచ్చే వాళ్ళు కుర్చోమని పంతులు చెప్తాడు. వాళ్ళెందుకు నేను ఒక తండ్రిగా దగ్గర అవ్వాలని అనుకుంటున్నా అంతే కానీ ఒకరికి దూరం చెయ్యడానికి కాదని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత పూజ చేస్తుంటే పోలీసులు వచ్చి.. మనుని అరెస్ట్ చేస్తారు. మీరు రాత్రి రాజీవ్ అనే అతన్ని షూట్ చేసారు. ఇదిగో సాక్ష్యమని పోలీసు అంటాడు. మను ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. అందరు షాక్ అవుతారు. అసలు మను అలాంటి వాడు కాదని అందరు అంటారు. చేసే ఉంటాడులే అందుకే సైలెంట్ గా ఇక్కడికి వచ్చాడని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.