Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఇంటికొచ్చిన మాణిక్యాన్ని అవమానించి పంపించేసిన శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -84 లో.. మాణిక్యం సీతాకాంత్ ఇంటికి పింకీని తీసుకొని వస్తాడు. అక్కడ టిఫిన్ చెయ్యమని అనగానే.. మాణిక్యం టిఫిన్ చేస్తుంటాడు. మీరు మావయ్యకి మన ఆఫీస్ లో ఫ్యూన్ పోస్ట్ ఇస్తే ఎంత అవమానంగా ఉంటుంది అన్నయ్య అంటు సీతాకాంత్ ని సిరి అడుగుతుంది. ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు.. ముందు ముందు ఇంకా పెద్ద జాబ్ ఇస్తానంటు సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే శ్రీలత వస్తుంది. టిఫిన్ చెయ్ చెల్లమ్మ అని శ్రీలతతో మాణిక్యం అనగానే.. శ్రీలత కోపంగా మాణిక్యం ప్లేట్ ని నేలకేసి కొడుతుంది. అది చూసి ఏం చేస్తున్నావమ్మ అంటూ సీతాకాంత్ ఆపుతాడు. నువ్వు వాళ్ళుకి రాచమర్యాదలు చెయ్యడం నాకు నచ్చలేదు. నువ్వు వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే నచ్చలేదు.. అలాంటిది వారిని కూర్చొపెట్టి, అతిథి మర్యాదలు చెయ్యడం నచ్చలేదని శ్రీలత అంటుంది. మా అక్క నేను ఇక్కడే ఉన్నాం.. అలాంటిది మా నాన్న రాకుండా ఎలా ఉంటాడని ధన అడుగుతాడు. నా కూతురు ఏడుపు భరించలేక మీ పెళ్లికి ఒప్పుకున్నాను.. అలాంటిది నువ్వు కూడ మా నాన్న వస్తే ఏంటని అడుగుతున్నావా అని శ్రీలత అంటుంది. మాణిక్యం ఇప్పుడు ఇంటికి వస్తే తప్పేంటని శ్రీలతతో సీతాకాంత్ అంటాడు.. నువ్వేనా అలా అంటుంది? వీడిని ఎలా క్షమించగలుగుతున్నావ్.. వీడు మన కుటుంబానికి చేసిన మోసాన్ని మర్చిపోయావా అని శ్రీలత అంటుంది. నేను మర్చిపోలేదు కానీ నా చెల్లి సంతోషం కోసం నేను అవి పట్టించుకోవడం లేదని సీతాకాంత్ అంటాడు. కానీ నేను మరచిపోను. వీడు ఇంకొకసారి ఇంటికి వస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని శ్రీలత అంటుంది. ఆపండి. ఆ రోజు ఏం జరిగిందనేది అందరికి తెలిసే రోజు వస్తుంది.. కానీ నా గురించి మీరు గొడవపడకండంటు పింకీని మాణిక్యం తీసుకొని బయలుదేర్తాడు. ఇప్పుడు  సీతాకాంత్ కి నాపై సింపతీ కలుగుతుందని మాణిక్యం అనుకుంటాడు.

ఆ తర్వాత మాణిక్యం వెళ్తుంటే ధన బయటకు వచ్చి.. నేను కూడా వస్తానంటాడు. నువ్వు ఇలా ఉండకూడదు.. ఇంకోసారి మీ నాన్నకి ఇలాంటి సిచువేషన్ రాకుండా చూడాలి.. నాకు ఫ్యూన్ పోస్ట్ ఇచ్చినట్టు నీక్కూడా ఇస్తారేమో భయమేస్తుంది.. అలా జరగకుండా చూసుకోమని ధనకి మాణిక్యం అన్ని చెప్పి వెళ్తాడు. మరొకవైపు తన నాన్నకి అవమానం జరిగిందని రామలక్ష్మి ఫీల్ అవుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు.. మీ అమ్మ గారి కోపంలో, ఆవేశం లో అర్థం ఉంది కానీ తినే ప్లేట్ ని నేలకు విసరడం కరెక్ట్ కాదని రామలక్ష్మి అంటుంది. దాంతో సారీ రామలక్ష్మి నువు బాధపడుతుంటే చూడలేనని సీతాకాంత్ అనగానే.. మీరు సారీ చెప్తుంటే నాకు కష్టం గా ఉంటుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత నేను ఈ ఇంటికి అతిథిని.. త్వరలోనే ఇక్కడ నుండి వెళ్లిపోవల్సిందే కదా అని రామలక్ష్మి అంటుంది. నువు అలా అంటుంటే నా మనసుకి చాలా కష్టం గా ఉంటుందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.