Read more!

English | Telugu

Brahmamudi : రుద్రాణి ప్లాన్ లో అనామిక బలిపశువు కానుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -394  లో....నాకు తెలుసు ఇలాంటిదేదో ఒకటి జరుగుతుందని తెలుసని అపర్ణ కోప్పడుతుంది. ఎందుకు అత్తయ్య ఇలా అంటున్నారు.. మీరేం అబద్ధం చెప్పలేదు కదా.. మీ కొడుకు బిడ్డ మీ మనవడని చెప్పారు అంతే కదా అని కావ్య అనగానే.. నోరు ముయ్ అసలు నువు ఎందుకు అబద్దం చెప్పావని కావ్యపై అపర్ణ విరుచుకుపడుతుంది. నేను ఈ ఇంటి పరువు పోకుండా కాపాడాను.. మరి నేను అబద్దం చెప్తే.. మరి మీరెందుకు నిజం చెప్పలేదు.. మీ అబ్బాయి గురించి నిజం ఎందుకు చెప్పలేదని అపర్ణను కావ్య నీలదీస్తుంది.

ఆ తర్వాత కుటుంబం పరువు తీసావంటూ రాజ్ ని అపర్ణ తిడుతుంది. ఇంకా రెండు రోజులు టైమ్ ఉంది.. ఈ లోపు బాబు పుట్టుక గురించి నిజం చెప్పకపోతే ఇంట్లో నుండి నేనే గెంటేస్తాను.. ఎవరైనా అడ్డు చెప్తే నా శవాన్ని చూస్తారని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిల దగ్గరికి కావ్య వెళ్లి.. మీకు అసలు కృతజ్ఞత అనేది ఉండదా? అన్నం పెట్టిన ఇంటి పరువు తీయాలనుకుంటారా అని వాళ్ళని తిడుతుంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. రాహుల్, రుద్రాణీలని తిడుతుంది.. ఇప్పుడు మీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తే మీ పరిస్థితేంటని కావ్య అంటుంది. ఇప్పుడే వీళ్ళ సంగతి చెప్తానని స్వప్న వెళ్ళబోతుంటే కావ్య ఆపుతుంది. ఇదొక్కసారి వదిలేస్తున్నానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మమ్మల్ని బయటకు పంపిస్తే.. నువ్వు కూడ మాతో పాటే వస్తావ్ కదా అని స్వప్నతో రాహుల్ అంటాడు.. నేను తాతయ్య ఇచ్చిన ఆస్తితో ధర్జాగా ఉంటానని స్వప్న వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత దీని దగ్గర నుండి ఆస్తి పేపర్స్ తీసుకున్నది బెటర్ అయిందని రాహుల్ అంటాడు.

ఆ తర్వాత అనామిక ఏడుస్తుంటే.. రుద్రాణి వెళ్లి ఇంకా రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. అప్పు ముందు నిన్ను కొట్టాడని ఏడుస్తున్నావా? నాకు తెలుసు అంత చూసాను కానీ ఇలా ఏడుస్తున్నావేంటి? మిడిల్ క్లాస్ వాళ్ళకి  మనం ముఖ్యం. అది పోయేలా చేస్తే చాలు అంటూ అప్పు పరువు తీసేలా అనామికకి రుద్రాణి ఒక ప్లాన్ చెప్తుంది.. తరువాయి భాగంలో అప్పుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత అనామికని కొట్టానని కళ్యాణ్ ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే.. అప్పుడే అనామిక పోలీసులతో ఇంటికి వస్తుంది.. ఈ హింస భరించలేకపోతున్నానని అంటుంది. దాంతో రాజ్ .. ఇప్పుడే యాక్షన్ తీసుకోకండి నిజాలు తెలుసుకోండి అని అనగానే.. మీరు యాక్షన్ తీసుకోకుంటే ఇప్పుడే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తానని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.