Read more!

English | Telugu

బిగ్ బాస్ ఫిట్టింగ్‌: పోటుగాళ్ళు వర్సెస్ ఆటగాళ్ళు!

బిగ్ బాస్ హౌజ్ లో ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ గురించి తాజాగా ప్రోమో వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో హౌజ్ లోకి కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చీ రాగానే పాత హౌజ్ మేట్స్, కొత్త హౌజ్ మేట్స్ కి మధ్య గట్టి ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్.

కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ కి పోటుగాళ్ళు అని చెప్పిన బాగ్ బాస్.. ఇప్పటివరకు హౌజ్ లో ఉన్నవారిలో ఎవరు అన్ డిజర్వింగ్ అని మీకు అనిపిస్తుందో చెప్పమని అన్నాడు. అయితే కొత్తగా వచ్చినవాళ్ళంతా మన సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్ లని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రోజు బెల్ట్ టాస్క్ లో.. లాగొద్దు లాగొద్దని అందరూ నిన్ను అంటుంటే‌‌.. ఎంకరేజ్ మెంట్ అని అనుకున్నావంటు, అది నాకు నచ్చలేదని టేస్టీ తేజని పూజా మూర్తి నామినేట్ చేసింది. ఆ రోజు బెల్ట్ టాస్క్ లో సంఛాలక్ గా నువ్వే ఉన్నావ్. టేస్టీ తేజ అలా చేస్తున్నప్పుడు నువ్వు ఆపకుండా అలానే చూస్తున్నావ్. అది నాకు నచ్చలేదని ఆట సందీప్ ని భోలే శావలి నామినేట్ చేశాడు. అదేవిధంగా అమర్ దీప్, శోభా శెట్టిలని అశ్విని శ్రీ నామినేట్ చేసింది. 

కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్(పోటుగాళ్ళు) లో‌ నుండి ఒకరిని, పాత కంటెస్టెంట్స్ (ఆటగాళ్ళు) లో నుండి ఒకరిని  నామినేట్ చేయాలని ఆటగాళ్ళకి చెప్పాడు బిగ్ బాస్. దాంతో నయని పావనిని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. ఇక శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు ఇద్దరు కలిసి అశ్విని శ్రీని నామినేట్ చేశారు. దాంతో తను ఏడ్చేసింది.  అమర్ దీప్ ని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. కారణం చెప్తూ.. ఇలాగే పొడిచేస్తే చించేస్తా అని ప్రతీవారం చెప్తున్నావ్ కానీ ఇదే రిపీట్ చేస్తున్నావ్. నీ ఆట ఇంప్రూవ్ చేయాలని నేను అకుంటున్నానని అమర్ దీప్ తో అంబటి అర్జున్ అన్నాడు. ఇలా కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ మధ్య మొదటిరోజే  ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్.