క్రేజీ కాంబో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చియాన్ విక్రమ్!
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి పేరుంది. 'అతనొక్కడే', 'కిక్', 'రేసుగుర్రం', 'ధృవ' వంటి హిట్ సినిమాలు ఆయన డైరెక్షన్ లో వచ్చాయి. అయితే ఈమధ్య ఆయన ట్రాక్ రికార్డు గొప్పగా లేదు. 'సైరా నరసింహారెడ్డి' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇక గత చిత్రం 'ఏజెంట్' అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సురేందర్ రెడ్డి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.