సుకుమార్‌తో షూటింగ్ ఎలా ఉంటుందో రష్మికకు తెలిసొచ్చింది!
సుకుమార్ ఎంతటి క్రియేటివ్ డైరెక్టరో, అంతటి వర్కోహాలిక్ కూడా. ఆయన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవాన్నీ, అనుభూతినీ ఇస్తుందనేది నిజం. అయితే ఆయన సినిమా సెట్స్‌పై యూనిట్ పడే కష్టాలు మాత్రం మామూలువి కావు. ఒక షాట్ ఓకే చెయ్యడానికి సుకుమార్ ఎన్ని టేకులు తీస్తాడో, ఆయనతో పనిచేసిన వాళ్లందరికీ అనుభవమే.