English | Telugu

మియామీలో రామ్ చరణ్ హాలిడే

మియామీలో రామ్ చరణ్ హాలిడే ఎంజాయ్ చేయబోతున్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న మియామీ బీచ్ లో యువ హీరో రామ్ చరణ్ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి వెళ్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రామ్ చరణ్ ఇటీవల నటించిన "ఆరెంజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో రామ్ చరణ్ ని కొన్నాళ్ళు వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి రీఛార్జ్ అవ్వవలసిందిగా, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలిసింది. బావ అల్లు అర్జున్ మరికొందరు స్నేహితుల సలహా మేరకు రామ్ చరణ్‍ అమెరికాలోని ఫ్లోరిడాలో కల విలాసవంతమైన మియామీ బీచ్ కి ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవటానికి బయలుదేరుతున్నారట.

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు ఇచ్చింది. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు గా ఏమిచ్చిందంటారా...? యువ హీరో రామ్ చరణ్ తన బావ అల్లు అర్జున్ మ్యారేజ్ కి యూరప్ నుండి ఒక కాస్ట్ లీ స్యూట్ తెప్పించాడు. దాని ఖరీదు మూడున్నర లక్షలు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా గిఫ్ట్ అందించారు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగా స్టార్ ఇచ్చిన మెగాగిఫ్ట్ ఏమిటంటే కార్టియర్ కపుల్ అనే కాస్ట్ లీ వాచ్ ని బహుమతిగా అందించారు. ఈ వాచ్ చాలా తక్కువగా అంటే ఓ పది వాచీలు మాత్రమే ఆ కంపెనీ లాంచింగ్ కోసం తయారుచేసింది.