Read more!

English | Telugu

విశ్వక్ సేన్ తో  బాలకృష్ణ నిర్మాత మూవీ..టైటిల్ అదిరింది

వెరైటీ చిత్రాల హీరో  విశ్వక్ సేన్(viswak sen) ఇటీవలే  గామి (gaami)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కష్ట తరమైన క్యారక్టర్ ని చాలా అద్భుతంగా పండించి తనెంత  వాల్యుబుల్ ఆర్టిస్టో  అందరకి తెలిసేలా చేసాడు. ఈ రోజు ఆయన  పుట్టిన రోజు. ఈ క్రమంలో ఒక నూతన చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

 విశ్వక్ సేన్ మొన్న వచ్చిన గామితో సహా  ఇప్పటి వరకు  11 సినిమాలు దాకా చేసాడు. ఇప్పుడు  12 వ చిత్రానికి  సంబందించిన అప్డేట్ వచ్చింది. ఆ మూవీ గత కొన్ని రోజులుగా v s 12 పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు విశ్వక్ బర్త్ డే సందర్భంగా  ఆ మూవీ టైటిల్ ని రిలీజ్ చెయ్యడం జరిగింది.  లైలా( laila)అనే టైటిల్ ని కన్ఫార్మ్ చేసారు. పైగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను కూడా  రిలీజ్ చేసారు. వీడియో ఆద్యంతం  చాలా ఆసక్తికరంగా ఉంది.ఇప్పుడు ఇది  సోషల్ మీడియాలో  ఫుల్ వైరల్ అవుతుంది.దీంతో అందరు విశ్వక్ సేన్ కి బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటుగా టైటిల్ విషయంలో కూడా అభినందలు తెలుపుతున్నారు.

 షైన్ స్క్రీన్స్  పతాకంపై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. లేటెస్ట్ గా బాలకృష్ణ (balakrishna) తో భగవంత్ కేసరి ని నిర్మించి ఉండటంతో  ఇప్పుడు లైలా  క్రేజీ ప్రాజక్ట్ గా మారింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈయన గతంలో  బట్టల రామస్వామి బయోపిక్‌కి దర్శకత్వం వహించాడు. ఆకాంక్ష శర్మ(akanksha sharma) హీరోయిన్ గా చేస్తుంది. తనిష్క్ బాగ్చి సంగీతాన్ని అందిస్తున్నాడు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.