Read more!

English | Telugu

చిన్న సినిమాలు తీస్తున్న బడా నిర్మాత..!

యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన కథ మెగా హీరో వరుణ్ కు నచ్చిందని, ఆ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తాడని వార్తలొచ్చిన అనంతరం.. మొన్నామధ్య దిల్ రాజు ఈ ప్రోజెక్ట్ నుంచి తప్పుకొన్నాడని కూడా తెలియజేశాం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను ఇప్పుడు ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చేజిక్కించుకొన్నారని తెలుస్తోంది. "నాన్నకు ప్రేమతో" అనంతరం మీడియం బడ్జెట్ సినిమాలపై దృష్టి సారించిన భోగవల్లి ప్రసాద్ అందులో భాగంగా ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు, ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగానూ ఒక సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలతోపాటు వరుణ్ తేజ్ హీరోగానూ "ఫీల్ మై లవ్" సినిమానూ రూపొందించనున్నాడు భోగవల్లి. ఇకపై ఈ బడా నిర్మాత చిన్న సినిమాలతోనే ముందుకు సాగుతాడేమో!