Read more!

English | Telugu

కుదటపడిన కమల్ ఆరోగ్యం..త్వరలో నడుస్తానంటున్నాడు..

యూనివర్శిల్ స్టార్ కమల్‌హాసన్ రెండు రోజుల క్రితం తన కార్యాలయంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడ్డారు. దీంతో సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కమల్ కాలుకి శస్త్ర చికిత్స చేశారు. తాను త్వరలోనే కోలుకుని నడుస్తానని ఆయన అన్నారు. నేను నిలబడగలుగుతున్నాను. త్వరలోనే నడుస్తాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిన ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదంటూ వాయిస్ మెసేజ్‌ను తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచి పంపారు.