Read more!

English | Telugu

‘తులసీవనం’ వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్: తులసీవనం
నటీనటులు:  అక్షయ్ లగుసాని, వెంకటేష్ కాకమాను, విష్ణు, ఐశ్వర్య తదితరులు
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
మ్యూజిక్: స్మరన్
సినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
నిర్మాతలు: ప్రీతమ్ దేవి రెడ్డి, స్వాగత్ రెడ్డి, నిలిత్ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రెడ్డి
ఓటీటీ: ఈటీవి విన్

అక్షయ్ లగుసాని, ఐశ్వర్య, వెంకటేష్ కాకమాను ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ' తులసీవనం '. తాజాగా ఈటీవీ విన్ ఓదికగా విడుదలైన ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ: 

హైదరాబాద్ లోని  ఫిల్మ్ స్టూడియోలో హీరోకి ఫ్రెండ్ పాత్రలో తొలిసారి స్క్రీన్ మీద కనిపించడానికి తులసీరామ్ రెడీ అవుతాడు. అయితే ఆ సీన్ లో తులసీరామ్ విఫలమవుతాడు. ఇక కాసేపటికి ఓ క్రికెట్ స్టేడియంలో చిన్న బెట్టింగ్ మ్యాచ్ తో తులసీరామ్ తనని తాను పరిచయం చేసుకుంటాడు. కర్నూల్ కి చెందిన తులసీరామ్ తన చిన్నతనంలోనే యాక్టర్ గానీ క్రికెటర్ గానీ అవ్వాలని కలలు కంటాడు. అయితే తులసీరామ్ వాళ్ళ నాన్న తనని ఐఏఎస్ అధికారిగా చూడాలనుకుంటాడు. ఇక పెద్దయ్యాక అతను ఇంజనీరింగ్ చేస్తాడు. ఇక ఫ్రెండ్స్ తో కలసి ఉంటూ జాబ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నా అని ఇంట్లో చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ సరేనంటారు. మరి తులసీరామ్ ఐఏఎస్ అయ్యాడా? లేక యాక్టర్ గానీ క్రికెటర్ గానీ అయ్యాడా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ: 

ఓ మూవీలో అవకాశం రావడంతో తులసీరామ్ ని తనని తాను పరిచయం చేసుకోవడం, తనే కథ చెప్తూ మొదలెట్టడం బాగుంది. అయితే ఇది యూత్ మైండ్ సెట్ ని బట్టి తీసినట్టుగా ప్రతీ సన్నివేశంలో మనకి తెలుస్తుంది. ఎక్కువగా అసభ్య పదజాలం వాడటంతో కుటుంబసమేతంగా చూడలేం.

ప్రస్తుతం ఈ సిరీస్ మూడు ఎపిసోడ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ కుర్రాడు తన కలల కోసం సమాజంలో , ఇంట్లో ఎలా సమస్యలని ఎదుర్కొంటాడో చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఆ పరిచయంలో హీరోని ఎక్కువగా తాగుడికి బానిస అయ్యినవాడిలా చూపించడం, బూతులు ఎక్కువగా మాట్లాడేవాడిలా చేయడం ఆడియన్స్ కి అతనెంటే ఎక్కువ ఇంట్రస్ట్ కలగదు. స్టోరీ చెప్తున్న హీరోనే బలాదూర్ గా ఉండటాన్ని ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. మొదటి ఎపిసోడ్ లోనే స్క్రీన్ ప్లే స్లోగా సాగడంతో బోరింగ్ ఫీల్ వస్తుంది. స్కిప్ చేస్తూ చూసిన కథ ముందుకు సాగదు.

ఇక ఇంజనీరింగ్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయడం కోసం వారు పడే కష్టాలు ఇలా అన్నీ యూత్ ని ఆకర్షించేలా ఉన్నాయి. మరోవైపు ఏది అడిగినా అడుగు పోయిన కొని తీసుకొచ్చే నాన్న పాత్ర అందరిని ఆలోచింపజేసేదిలా ఉంటుంది. ఓ వైపు క్రికెటర్ అవ్వాలని ఇంజనీరింగ్ నుండి అనుకోవడం, మరోవైపు సినిమాలో అవకాశాల కోసం పరుగు తీయడం, ఫ్రెండ్స్ తో కలిసి టైమ్ గడపడం.. అలా సరదా సరదాగా మొదటి రెండు ఎపిసోడ్ లు ముగుస్తాయి. ఇక మూడవ ఎపిసోడ్ లో హీరోయిన్ ఐశ్వర్య ఎంట్రీ ఉంటుంది.

హీరోయిన్ ఎంట్రీ తర్వాత తులసీరామ్ పాత్ర ఆడియన్స్ కాస్త కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ లో ఉన్నవే మూడు ఎపిసోడ్ లు అయితే వాటి నిడివి దాదాపు నలభై నిమిషాలు ఉండటంతో ఇంకా ఎప్పుడు ముగుస్తుందా అనిపిస్తుంది. ల్యాగ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. స్మరన్ మ్యూజిక్ బాగుంది. ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రవితేజ ఎడిటింగ్ పర్వాలేదు. మొదటి ఎపిసోడ్, రెండవ ఎపిసోడ్ లలో కొన్ని సీన్లని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

తులసీరామ్ పాత్రలో అక్షయ్ లగుసాని ఒదిగిపోయాడు. తులసీరామ్ స్నేహితుడిగా వెంకటేష్ కాకమాను ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య అభినయాన్ని ప్రదర్శించింది. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటింటి మెప్పించారు.

ఫైనల్ గా : యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉన్న ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.

రేటింగ్ : 2.25/5


✍️. దాసరి మల్లేశ్