English | Telugu
టూరిస్ట్ బస్ లో తుడరుమ్ మూవీ..ఒక మంత్రి రంగంలోకి
Updated : May 6, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)శోభన(Shobana)కాంబోలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'తుడరుమ్'(Thudaram). ఏప్రిల్ 25 న విడుదలైన ఈ మూవీ తెలుగులోను హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చాలా చోట్ల థియేటర్స్ ని కూడా పెంచారు. మలయాళంలో అయితే ఇప్పటికే 160 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన పైరసీ ని మలప్పురంలోని ఒక టూరిస్ట్ బస్ లో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలవడంతో తుడరుమ్ ని నిర్మించిన రంజిత్ సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు. ఈ విషయంపై సంబంధిత కేరళ మంత్రి మాట్లాడుతు 'బస్ లో ప్రదర్శించినట్టుగా సరైన ఆధారాలు చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది.
తరుణ్ మూర్తి(Tharun Moorthy)దర్శకత్వంలో తెరకెక్కిన 'తుడరుమ్' లో షణ్ముగం అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన టాక్సీ డ్రైవర్ గా మోహన్ లాల్ అత్యద్భుతంగా నటించాడు. ఆయన భార్య లలిత గా శోభన కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాసిల్, బినుపప్పు, మనియన్ పిల్లా రాజు ఈ విధంగా అందరు కూడా సినిమా విజయంలో బాగస్వామ్యమయ్యారు. జెక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు.
