Read more!

English | Telugu

తమిళనాడులో సెప్టెంబర్ 5 న విజయ్ ఫ్యాన్స్ కి సెలవు.. ప్రకటించిన సంస్థ 

ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.ఆ మాటకొస్తే ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే ఒక మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. ఇక తలపతి విజయ్ అభిమానులు  గురించి అయితే  చెప్పక్కర్లేదు క్యాలండర్ లో  సెప్టెంబర్ 5 న ఫెస్టివల్ అని కూడా నోట్ చేసుకున్నారు.ఇంతకీ సెప్టెంబర్ 5 కి విజయ్ కి సంబంధం ఏంటి!

విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సైన్స్ ఫిక్షన్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ మూవీ కోసం అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ సెప్టెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. అందులో విజయ్ కళ్ళకి కళ్లద్దాలు ధరించి నెరిసిన జుట్టు, గడ్డంతో సీరియస్ లుక్ లో ఉన్నాడు. ఆ లుక్ ఇప్పుడు సినిమా మీద అంచనాలని పెంచేసింది. ఫ్యాన్స్ అయితే సంబరాలు కూడా చేసుకుంటున్నారు. 

వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ ని పోషిస్తున్నాడు.    ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం ,మోహన్, స్నేహ, లైలా లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  పొలిటికల్ పంచ్ లు ఏమైనా ఉంటాయేమో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ మూవీకి విజయ్  230 కోట్ల రూపాయిల  పారితోషకాన్ని  తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.