English | Telugu

ముంబైకి షిఫ్ట్ అవుతున్న సూర్య - జ్యోతిక‌!

క‌పుల్ గోల్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా సెట్ చేస్తుంటారు సూర్య‌, జ్యోతిక‌. లేటెస్ట్ గా వారికి సంబంధించిన ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. వారిద్ద‌రూ ముంబైకి షిఫ్ట్ అవుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. బాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉండే ప్ర‌దేశంలో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేశారు. తొమ్మిదివేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని కొనుగోలు చేశార‌ట‌. దీనికోసం దాదాపు 70 కోట్లు ఖర్చుపెట్టార‌ట‌. ప్ర‌స్తుతం జ్యోతిక హిందీ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ‌గా ముంబైలోనూ,  చెన్నైలోనూ జ‌రుగుతోంది. పైగా సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై హిందీలోనూ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. వెళ్లిన ప్ర‌తిసారీ అక్క‌డ హోటల్స్ లో ఉండ‌టం క‌న్నా సొంతంగా ఓ ఇంటిని ఏర్పాటు చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. మ‌రోవైపు పిల్ల‌ల చ‌దువుల కోసం అక్క‌డ ఇల్లు తీసుకున్నార‌నే మాట కూడా వినిపిస్తోంది.

ప‌ర్మ‌నెంట్‌గా అక్క‌డికి వెళ్ల‌ర‌ని, జ‌స్ట్ అక్క‌డ కూడా ఒక లివింగ్ స్పేస్ కావాల‌ని ఇల్లు కొనుగోలు చేశార‌న్న‌ది మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తున్న మాట‌. సూర్య‌, జ్యోతిక ఇద్ద‌రూ ప్రేమించుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్ప‌టికీ, సూర్య ఫ్యామిలీతో క‌లిసే ఉంటున్నారు జ్యోతిక‌.సూర్య‌ను పెళ్లి చేసుకుని తాను త‌మిళ్ మాట్లాడ‌టం నేర్చుకున్నాన‌ని, ఇప్ప‌టికీ సూర్య‌కు హిందీ మాట్లాడ‌టం రాద‌ని చాలా సార్లు చెప్పుకొచ్చారు జ్యోతిక‌. సూర్య ప్ర‌స్తుతం సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేష‌న్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దిశా పఠాని నాయిక‌గా న‌టిస్తున్నారు. త‌మిళ కొత్త సంవ‌త్స‌రాదిని పురస్క‌రించుకుని ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.