Read more!

English | Telugu

ఎన్టీఆర్ ని వెంటాడుతున్న సూర్య..!

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR).. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(Devara) సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి పోటీగా 'కంగువా' రాబోతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కంగువ'(Kanguva). ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాదే విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ చిత్రాన్ని వారు అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి 'దేవర' ఏప్రిల్ 5నే విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కారణంగా అక్టోబర్ 10కి వాయిదా పడింది. అయితే 'దేవర' వాయిదా పడక ముందు.. 'కంగువ' కూడా ఏప్రిల్ లోనే విడుదల కానుందంటూ వార్తలు వినిపించాయి. కానీ దేవరతో పాటే ఆ సినిమా కూడా వాయిదా పడింది. అయితే ఇప్పటికే 'దేవర' అక్టోబర్ ని లాక్ చేసుకోగా.. ఇప్పుడు 'కంగువా' కన్ను కూడా అక్టోబర్ పైనే పడినట్లు న్యూస్ వినిపిస్తోంది. అదే జరిగితే 'దేవర', 'కంగువా' మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదు. రెండూ పాన్ ఇండియా సినిమాలు కావడంతో.. రెండింటికీ అన్ని భాషల్లో వసూళ్లు ముఖ్యమే. కానీ ఒకేసారి విడుదలైతే మాత్రమే.. తెలుగులో 'కంగువా' వసూళ్లపై, తమిళ్ లో 'దేవర' వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.