English | Telugu

మృణాల్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్!

మృణాల్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్!

 

సుమంత్, మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ పెళ్లి వార్తలపై స్పందించారు సుమంత్.

 

సుమంత్ నటించిన ఓటీటీ ఫిల్మ్ 'అనగనగా' మే 15 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రెండో పెళ్లి వార్తలపై ఆయన స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

 

నటి కీర్తిరెడ్డిని 2004 లో వివాహం చేసుకున్న సుమంత్.. మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు. అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగానే ఉంటున్నారు. మధ్యమధ్యలో సుమంత్ రెండో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా మృణాల్ తో సుమంత్ క్లోజ్ గా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో మళ్ళీ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలను సుమంత్ ఖండించారు. ఆ ఫొటో 'సీతారామం' సినిమా ప్రమోషన్స్ సమయంలోదని తెలిపారు.