Read more!

English | Telugu

శ్రీదేవి ఇల్లు అద్దెకి.. కూతురు పనే అదంతా 

అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులకి గుడ్ న్యూస్..గుడ్ న్యూస్ అనే కంటే వాళ్ళకి వచ్చిన అదృష్టమే  అని చెప్పాలి ఎందుకంటే శ్రీదేవి మరణించి ఇప్పటికీ  ఆరు సంవత్సరాలు అవుతుంది. అయినా  కూడా డైలీ శ్రీదేవి  సినిమాలు చూసే అభిమానులు లక్షల్లోనే ఉంటారు. అంతలా  ఆమెని ఆరాధిస్తారు. మరి ఆ  ఆరాధ్యదేవత ఇల్లు వాళ్ళకి  దక్కితే. ఇంక అంతకు మించి అదృష్టం ఉండదు కదా    

శ్రీదేవికి  చెన్నైలో ఒక  విలాసవంతమైన  బీచ్‌ హౌజ్‌ ఉంది.ముంబై కి చెందిన బోనీ కపూర్‌తో వివాహం జరిగాకే ఆ ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటికీ ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తు బిజీగా ఉంది. దాంతో  చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. అందుకనే ఎంతో ముచ్చటపడి  సదరు ఇంటిని కొనుగోలు చేసింది.పైగా  ఆ రోజుల్లోనే ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అధునాతమైన సౌకర్యాలతో ఉండేలా రీ మోడల్ చేయించింది. ఇప్పుడు ఈ ఇల్లుని రెంట్ కి ఇవ్వబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ రెంటల్  సంస్థ airbnb ఆ  అవకాశాన్ని కల్పిస్తుంది.  ఐకాన్స్‌ లో భాగంగా ప్రపంచంలోని పదకొండు సెలబ్రిటీల ఇళ్లను సదరు సంస్థ  రెంట్‌కు  ఇస్తుంది. వాటిల్లో  శ్రీదేవి ఇల్లు కూడా ఒకటి.

కాకపోతే  శ్రీదేవి ఇంట్లో ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది.ఒక బెడ్‌రూమ్‌,ఒక బాత్రూమ్‌ యాక్సెస్‌ లభిస్తుందని  సంస్థ పేర్కొంది. మే 12  నుంచి బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ వార్త శ్రీదేవి అభిమానుల్లో ఆనందాన్ని తెస్తుంది. ఇంటి లోపల ఎలా ఉందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ తో బుకింగ్స్ కోసం పోటిపడుతున్నారు.  ఇంటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి. కావాలంటే ఒక లుక్ వేయవచ్చు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24 న చనిపోయింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకొని  సుమారు  300 చిత్రాల దాకా నటించింది.ఆమెకి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ కొత్త మూవీలో  హీరోయిన్ గా చేస్తుంది. హౌస్ రెంట్ కి  తీసుకున్న వారితో   జాన్వీ కూడా మాట్లాడుతుంది