Read more!

English | Telugu

ఐ లవ్ చెప్పినోడి చెంప పగులగొట్టిన శ్రీముఖి!

"కేరింత" మూవీ ఫేమ్ యంగ్ హీరో నూకరాజు అలియాస్ పార్వతీశం చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీద ప్రత్యక్షమయ్యాడు. 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమాలో నటిస్తున్నాడు. వీఎస్ ముఖేశ్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో ప్రణికాన్విక హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్టేజి మీద స్టార్ యాంకర్ శ్రీముఖితో ఒక రేంజ్ లో పరాచికాలు ఆడాడు పార్వతీశం.. శ్రీముఖి దగ్గరకు వచ్చిన పార్వతీశం " మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ" అని ప్రపోజ్ చేసాడు అప్పుడు శ్రీముఖి గట్టిగా చెంప చెళ్లుమనిపించింది.. 'చేతిలోకి టమాటో తీసుకుని ఏయ్.. మహాలక్ష్మి..మార్కెట్ మహాలక్ష్మి మనతో మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ మూవీలో హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..  ఈ క్రమంలోనే ప్రమోషన్స్  జోరు పెంచారు మూవీ టీమ్. ఇక ఇటీవల 'మహాలక్ష్మి' అనే పేరు ఉన్న టాప్ 200 మహాలక్ష్ములకు మా 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రమోషన్స్ షూరు చేశాడు పార్వతీశం. కేరింత మూవీ ఒకప్పుడు మంచి యూత్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని అలరించింది. అందులో ఉన్న నాలుగు క్యారెక్టర్స్ లో పార్వతీశం క్యారెక్టర్ మాత్రం బాగా నవ్వు తెప్పించేదిలా ఉంటుంది. మరి అలాంటి పార్వతీశం ఇప్పుడు ఈ మూవీలో ఎలా నవ్విస్తాడో చూడాలి.