Read more!

English | Telugu

ఆల్రెడీ 60 శాతం అయిపోయిందంట..రెబా జాన్ కదా  

దశాబ్దంన్నర కిందటే హీరో శ్రీ విష్ణు( sree vishnu) సినీ ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఇమేజ్ తో సంబంధం లేకుండా  డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చెయ్యడం విష్ణు స్పెషాలిటీ.  మధ్యలో అపజయాలు  వచ్చినా  కూడా ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు. నా రూటే సపరేటు అని. ఇప్పుడు హీరో శ్రీ విష్ణు కూడా తన రూటే సపరేటు అని మరోసారి నిరూపించాడు. ఎలాగో చూద్దాం


శ్రీ విష్ణు ఇటీవలే ఓం భీమ్ బుష్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో విష్ణు నెక్ట్ మూవీ ఏంటి అనే ఆసక్తి అందరిలో ఉంది.తీరా  ఇప్పుడు వాళ్ళందరు సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్ చూసి షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే విష్ణు కొత్త  సినిమా ఆల్రెడీ  60 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.దీంతో విష్ణు రూటే సపరేటు అని అందరకి తెలిసింది. ఎందుకంటే గత కొంత కాలం నుంచి విష్ణు సినిమాలు సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న తర్వాతనే ప్రేక్షకులకి తెలుస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే  విష్ణు సరసన సామజవరగమనా లో జోడి కట్టిన రెబా జాన్ (Reba Monica John) హీరోయిన్ గా చేస్తుంది.

లైట్ బాక్స్ మీడియా పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ గా తెరకెక్కుతుండగా  హుస్సేన్ షా కిర‌ణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. విద్యాసాగ‌ర్  సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండగా  కాల భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే  మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.