Read more!

English | Telugu

‘సైరన్’ మూవీ రివ్యూ

 

మూవీ : సైరన్
నటీనటులు: జయం రవి, కీర్తి సురేష్, యోగి బాబు, సముద్రఖని, అనుపమ పరమేశ్వరన్, అజయ్  తదితరులు
ఎడిటింగ్: రూబెన్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్ కుమార్
బిజిఎమ్: సామ్ సి.ఎస్.
సినిమాటోగ్రఫీ: ఎస్.కె సెల్వకుమార్
నిర్మాతలు: సుజాత విజయకుమార్
రచన, దర్శకత్వం:  ఆంటొని భాగ్యరాజ్
ఓటీటీ:  డిస్నీ ప్లస్ హాట్ స్టార్

జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేసింది‌. ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

అర్థరాత్రి వర్షంలో ఒకతను ఒకడిని సంచిలో తీసుకొచ్చి.. వాటి చెవులలో పొడొచి పొడిచి చంపేస్తాడు.  ఆ తర్వాత అలా వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అదే సమయంలో జైలులో ఉన్న తిలక్(జయం రవి) ని జైలర్ పిలుస్తాడు. జైలులో ఉన్న ఖైదీలంతా ఏదో ఒక కారణంతో బయటకు వెళ్తున్నారని, తమ కుటుంబాన్ని చూసి వస్తున్నారని, నువ్వు వెళ్ళవా అని అడుగగా.. నాకు వెళ్ళాలని లేదని  తిలక్ అంటాడు. అదేంటయ్యా నువ్వు జైలులో ఉండి పద్నాలుగేళ్ళు అవుతుంది.. ఒక్కసారి కూడా నీ కూతురిని చూడలనిపించడం లేదా అని, పేరోల్ లో వెళ్ళవయ్య అని జైలర్ చెప్పగానే.. తిలక్ సరేనంటాడు. పన్నెండు రోజులు పేరోల్ తిలక్ ఉండటానికి అతడికి షాడో పోలీస్ గా శ్రీశైలం(యోగిబాబు) అనే కానిస్టేబుల్ ఉంటాడు. అయితే అదే సమయంలో సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. దానిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నందిని(కీర్తి సురేష్) అనే పోలీస్ అధికారి తన సస్పెన్షన్ తర్వాత జాయిన్ అవుతుంది. మరి ఆ వరుస హత్యలు చేస్తుందెవరు? తిలక్ తన కూతురిని కలిసాడా? తిలక్ కి ఆ హత్యలకి ఏమైన సంబంధం ఉందా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అర్థరాత్రి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడంతో.. చంపిదెవరు? చచ్చిందెవరు అనే క్యూరియాసిటితో కథ ఆసక్తిగా మొదలైంది. ఇక పద్నాలుగేళ్ళు జైలులో ఉండి తన కూతురి కోసం తిలక్ రావడంతో ఎమోషనల్ గా బాగుంటుంది. అదే సమయంలో వరుస హత్యలు జరుగుతుండటంతో కథ పూర్తిగా థ్రిల్లర్ గా మారుతుంది. అయితే మొదటి ముప్పై నిమిషాల సమయం చాలా స్లోగా సాగుతుంది.

క్యారెక్టర్లని పరిచయం చేయడానికి అంత సమయం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నందిని కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అక్కడి నుండి కథ ఓ ఇంటెన్స్ తో  వెళ్తుంటుంది. అయితే కొన్ని చోట్ల మనం ముందుగానే ఏం జరగబోతుందో ఊహించగలం‌. హీరో పాత్రని చాలా సాలిడ్ గా చూపించిన దర్శకుడు.. విలన్ ని అంతే బలంగా చూపించలేకపోయాడు.

రవితేజ నటించిన కిక్ సినిమాలో లాగా క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా సాగే సీన్స్ ఉన్నా వాటిని మనం ముందుగానే ఊహించేయగలం.. ఓ రివెంజ్ డ్రామాలో థ్రిల్లర్ ని జోడించి అందులోనే నాన్న కూతురు ప్రేమని చూపించారు డైరెక్టర్. ఇక వరుస హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరా అనే క్యూరియాసిటితో ఉన్న ప్రేక్షకుడికి ఆ ట్విస్ట్ రివీల్ చేయకపోవడం కాస్త నిరాశని కలిగిస్తుంది. అయితే హత్యలు జరిగే విధానాన్ని సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. బ్యాక్ డ్రాప్ స్టోరీ కాస్త సప్పగా సాగుతుంది. అంబులెన్స్ డ్రైవర్ గా తిలక్ చేసిన ఎఫర్ట్స్ ని కళ్ళముందు కన్పిస్తుంది. వాస్తవ సంఘటనలని మిక్స్ చేసినట్టుగా తిలక్ పాత్రని మలిచారు. 

ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగినా సెకండాఫ్ ని ఫుల్ ఎంగేజింగ్  చేశారు మేకర్స్. అయితే డీఎస్పీ అధికారి అంత క్రైమ్ చేస్తున్నట్టు తెలిసిన సాటి పోలీస్ అధికారిణిగా నందిని.. దానిని ప్రతిఘటించకపోవడం వారి పైనున్న అధికారులకి చెప్పకపోవడం కాస్త లాజిక్ లేకుండా ఉంటుంది‌. సామ్ సి.ఎస్ బిజిఎమ్ బాగుంది. చాలా సీన్లనో బిజిఎమ్ తో ఇంటెన్స్ ని క్రియేట్ చేశాడు. జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఆకట్టుకుంది. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. అయితే మొదటి ముప్పై అయిదు నిమిషాలని ఇరవై నిమిషాలుగా ట్రిమ్ చేస్తే ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. నాన్న కూతురి బాండింగ్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నందినిగా కీర్తి సురేష్, తిలక్ గా జయం రవి సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. యోగిబాబు, సముద్రఖని, అనుపమ పరమేశ్వరన్, అజయ్ వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : కాస్త స్లోగా సాగిన.. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడేవారికి మస్ట్ వాచెబుల్ మూవీ.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్