Read more!

English | Telugu

'దేవర' లుక్.. ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమా!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్ విభిన్నంగా, పవర్ ఫుల్ గా ఉంది. నల్ల దుస్తుల్లో ఉన్న ఆయన లుక్ ని చూసి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ లుక్ తో ఎన్టీఆర్ సినిమా అంతా కనిపించడని, కేవలం ఫ్లాష్ బ్యాక్ లోనే ఇలా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర తాలూకా లుక్ అని టాక్ వినిపిస్తోంది. కొడుకు పాత్ర లుక్ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని వినికిడి. మరి 'దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం', 'తాజాగా విడుదలైన పోస్టర్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లుక్' అనే వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5 న విడుదల కానుంది.