Read more!

English | Telugu

సర్ ప్రైజ్.. సమంత, సిద్ధు కాంబోలో మూవీ!

ఇటీవల కొందరు సీనియర్ స్టార్ హీరోయిన్లు కుర్ర హీరోలతో జత కడుతున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి జోడిగా అనుష్క శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరో యంగ్ హీరో  సిద్ధు జొన్నలగడ్డకి జోడిగా సమంత నటించనుందని సమాచారం.

'అలా మొదలైంది', 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకురాలు నందిని రెడ్డి.. ఈ వారం 'అన్నీ మంచి శకునములే' చిత్రంతో పలకరించనుంది. అయితే దీని తర్వాత ఆమె చేయబోయే చిత్రంలో సమంత, సిద్ధు నటించనున్నారని తెలుస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఇప్పటికే 'జబర్‌దస్త్', 'ఓ బేబీ' అనే రెండు సినిమాలు చేసింది. అందులో 'జబర్‌దస్త్' నిరాశపరచగా, 'ఓ బేబీ' మంచి విజయం సాధించింది. 'ఓ బేబీ'ని ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. దానిలో హీరో నాగశౌర్య స్పెషల్ రోల్ లో సందడి చేశాడు. మరి ఇప్పుడు సమంత, సిద్ధు కాంబినేషన్ లో రానున్న సినిమా కూడా అలాగే ఉంటుందా లేక 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అనుష్క-నవీన్ లా జోడిగా నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.