Read more!

English | Telugu

సమంత.. వాళ్ళ ఇంటి బంగారమంట...

ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఇటీవల ఆమె నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ లో రూపొందనున్న మొదటి సినిమాను ప్రకటించారు.

ట్రాలాలా బ్యానర్ నుంచి రానున్న మొదటి చిత్రానికి 'మా ఇంటి బంగారం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇందులో సమంతనే ప్రధాన పాత్ర పోషిస్తోంది. నేడు ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. గృహిణి తుపాకీ పట్టి వయలెంట్ గా మారితే ఎలా ఉంటుంది అన్నట్టుగా పోస్టర్ లో సమంత లుక్ ఉంది. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.