Read more!

English | Telugu

రామ్ చరణ్ మామ విశ్వేశ్వర్ రెడ్డిపై ప్రముఖ నటి పోటీ.. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్  


ఎన్నెన్నో  జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమతా నీది నాది. ఈ లిరిక్ ఒక ఫేమస్ మూవీ లోనిది.రచయిత ఏ ముహూర్తాన ఆలోచించి రాశాడో గాని ఇప్పుడు రాజకీయాలకి సినిమాలకి అలాంటి పరిస్థితే వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాల్లోకి వచ్చేది రాజకీయాల కోసమే అనే పరిస్థితి కూడా ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సినిమా నటులు, నటీమణులు రాజకీయాల్లో  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవలో ఇంకో ప్రముఖ నటి కూడా చేరింది.


దాసరి సాహితి.. అచ్చ తెలుగు యువ నటి..సత్యం రాజేష్ హీరోగా తెరకెక్కిన మా ఊరి పొలిమేర సిరీస్ లో నటించింది. మొదటి పార్ట్ లో గెటప్ శ్రీను భార్యగా సెకండ్ లో రాజేష్ తో కలిసి నటించింది.మంచి నటి అనే గుర్తింపుని కూడా సంపాదించింది. ఇప్పుడు తను తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపి అభ్యర్థిగా పోటీ  చేస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాకపోతే తను ప్రస్తుతం ఉన్న ఏ పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చెయ్యడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగనుంది. ఈ మేరకు బుధవారం నామినేషన్ ని కూడా దాఖలు చేసింది. 

పొలిమేర కంటే ముందే పలు కన్నడ, తమిళ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా  చేసింది. తెలుగులో కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి.  పాకెట్ మనీ కోసమే సినిమాల్లోకి వచ్చానని చాలా ఇంటర్వూస్ లో చెప్పింది. ఇనిస్టాగ్రామ్ లో తనకి  పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని చెప్పుకునే సాహితి మరి ఎలక్షన్స్ లో ఆ దిశగా ఓట్లు అడుగుతుందేమో చూడాలి. ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే బీజేపీ తరుపున పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చిన మామయ్య. అంటే పవన్ ఫ్యాన్ వర్సెస్ రామ్ చరణ్ మామ