English | Telugu

రానా నిజస్వరూపం ఇదే 

రానా నిజస్వరూపం ఇదే 

విక్టరీ వెంకటేష్(venkatesh)రానా(Rana)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రానా నాయుడు పార్ట్  2 (Rana naidu 2)ఈ నెల 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలో అందుబాటులోకి  రానుండగా 2023 లో  వచ్చిన రానా నాయుడు మొదటి భాగాన్ని మించి ఉండబోతుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడి చేసారు.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా రానా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చిత్ర పరిశ్రమకి చెందిన కుటుంబం నుంచి రావడం వల్ల ఇండస్ట్రీ గురించి మరింత ఎక్కువ తెలుసుకునే వెసులుబాటు ఉండటంతో పాటు, అవకాశాలు వెంటనే రావడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉపయోగపడదు. ఎందుకంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం కెమెరా ముందుకు నుంచొని యాక్ట్ చెయ్యాల్సిందే. నువ్వు చేసే పని మీదే నీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. మా అమ్మ ఫిలిం లేబరేటరీలో వర్క్ చేసారు. నాన్న స్టూడియో నడిపిస్తున్నారు. బాబాయ్ నటుడు. దాని వల్లే నటుడుగా ఆ మూడు విభాగాలపై అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు.

ఇక రానా నాయుడు 2 లో అర్జున్ రామ్ పాల్, సుర్విన్ చావ్లా, కృతి కర్బందా, అభిషేక్ బెనర్జీ, డినో మారియో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

 

 

రానా నిజస్వరూపం ఇదే