English | Telugu
కఠినాత్ములు మా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు..ఆర్ఆర్ఆర్ సూపర్ స్పీచ్
Updated : May 27, 2025
సుమంత్(Sumanth)కాజల్ చౌదరి(Kajal Choudhary)జంటగా తెరకెక్కిన చిత్రం 'అనగనగా'(Anaganaga)విహార్ష్, శ్రీనివాస్ అవసరాల, అను హాసన్, బివిఎస్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్నీ సంజయ్(Sunny Sanjay)రచనా దర్శకత్వంలో క్రిషి ఎంటర్ టైన్ మెంట్ పై రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ సంయుక్తంగా నిర్మించగా, ఈ నెల 15 నుంచి ఓటిటి వేదికగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
రీసెంట్ గా 'అనగనగ 'చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishna Raju)చూడటం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతు అనగనగా లాంటి సినిమాలని ఈ రోజుల్లో అందరు చూడాలి. స్కూల్, కాలేజీల్లో ప్రస్తుతం జరుగుతున్న పిల్లల ఆత్మహత్య అంశాన్ని సున్నితంగా స్పృశిస్తూ, ఎలాంటి అసభ్య సన్నివేశాలకి తావు లేకుండా చిత్రీకరించారు. ముఖ్యంగా తల్లి తండ్రులు, విద్యార్థులు ఖచ్చితంగా చూడాలి. కఠినంగా ఉండే వాళ్ళు కూడా ఈ మూవీ చూసీ కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి కథాంశంతో ప్రతి ఒక్కరు ఆలోచించేలా తెరకెక్కించారు. దర్శక నిర్మాతలని ప్రోత్సహిస్తున్నందుకు ఈటీవీ విన్ యాజమాన్యానికి ధన్యవాదాలు అని ఆయన కొనియాడటం జరిగింది.
2022 లో మరాఠీ లాంగ్వేజ్ లో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న ఫ్యామిలీ డ్రామా 'ఎక్దా కాయ్ జలా" అనే మూవీని ఇన్ స్పైర్ గా తీసుకొని 'అనగనగా' ని తెరేక్కించడం జరిగింది. మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి కూడా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
