English | Telugu

హరిహర వీరమల్లుపై ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..ఓటిటి లో చూస్తే ఇండస్ట్రీ నాశనం 

హరిహర వీరమల్లుపై ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..ఓటిటి లో చూస్తే ఇండస్ట్రీ నాశనం 

విప్లవ సినిమాలతో ప్రేక్షకుల్లో చైతన్యాన్ని నింపి తనకంటు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న హీరో ఆర్ నారాయణమూర్తి(R narayanamurthy). సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తన సినీ ప్రయాణంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించాడు. 

రీసెంట్ గా ఆయన  సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడుతు 'పర్సంటేజ్ విషయంలో థియేటర్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ ల మధ్య వివాదం నెలకొని ఉంది. అందుకే థియేటర్స్ బంద్ అంశం తెరపైకి వచ్చి ఉంటుంది. అంతే తప్ప హరిహర వీరమల్లు(Harihara Veeramallu)కోసమే థియేటర్స్ బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజ్ ఖరారు అయితే నాలాంటి నిర్మాతలకి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో పర్సంటేజ్  విషయంలో ఛాంబర్ ముందు  నిరాహార దీక్ష చేసాం. కానీ ఫలితం శూన్యం. పర్సంటేజ్ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహరవీరమల్లుకి  లింక్ పెట్టడం సరి కాదు. పరిశ్రమ పెద్దలు ఏపి ముఖ్య మంత్రిని కలవాలని డిప్యూటీ సిఎం పవన్ అనడంలో తప్పు లేదు.

ప్రస్తుతం వినోదం భారీగా పెరిగింది. టికెట్ రేట్స్ పెంచడం వాళ్ళ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. భారీ ఖర్చుతో సినిమాలు నిర్మించామని టికెట్ రేట్స్ పెంచకూడదు. లవకుశ(Lava kusa) సినిమా ఐదేళ్లు తీసినా టికెట్ రేట్స్ పెంచాలని ఎవరు అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వాళ్ళ అభిమానులే వాళ్ళ హీరోల సినిమాలు చూడటం లేదు. ప్రేక్షకులు ఓటిటి లో సినిమా చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుందని చెప్పుకొచ్చాడు.