English | Telugu

యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. పదేళ్ల కాపురం నాది 

యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. పదేళ్ల కాపురం నాది 

లెజండ్ మూవీలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు. రాజకీయం బై బర్త్  నా బ్లడ్ లోనే ఉందని. ఏపి లో ఎలక్షన్స్ ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు ఈ  డైలాగ్ కొంత మంది సినిమా వాళ్ళకి సూటవ్వుతుంది. రాజకీయాల్లో అసలు ఎప్పుడు కనపడని వాళ్ళు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలని చూస్తుంటే ప్యాకేజి వచ్చిందనే విషయం అర్ధమవుతుందనుకోండి. ఈ  కోవలో తాజాగా  చేరిన నటి యాంకర్ శ్యామల. ఈమె గురించి  పృథ్వీ చెప్పిన మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి 

 యాంకర్ శ్యామల  సినిమా ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా చేస్తుంది. అప్పుడప్పుడు  సినిమాల్లో కూడా మెరుస్తుంటుంది. తాజాగా  ఆమె  మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షడు  పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి గుంట నక్క, ముసలి తోడేలు అని విమర్శించింది.ఆమె మాటలకి  పృథ్వీ తనదైన శైలిలో  కౌంటర్ ఇచ్చాడు. లౌక్యంలో శ్యామల నాతో పాటు చేసింది. ఆమె పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబుని తిడుతుంది. వచ్చేయమ్మా నిన్ను ఐదు నిమిషాల్లో పంపిచేస్తా  అని మాట్లాడిన అవంతి శ్రీనివాస్‌ని  పక్కన పెట్టుకుని తిడుతుంది.పైగా  విశాఖపట్నం సుందరంగా ఉందని చెప్తుంది. మరి ఆమెకి ఇచ్చిన పేమెంట్‌లో  విశాఖపట్నం గురించి కొంచెం ఎక్కువ చెప్పమని అన్నారేమో. కానీ శ్యామలకి తెలియని విషయం ఏంటంటే వైజాగ్ ప్రజలు నువ్వు కనిపిస్తే చెప్పులతో కొట్టేలా  ఉన్నారనే సంచలన వ్యాఖ్య చేసాడు.రోజా కూడా గతంలో  ఓ దరిద్రుడు జైలుకిపోతే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని  మాట్లాడింది. వీళ్ళ వరసలన్నీ     ఒకే రకంగా ఉంటాయి. కొంచెం కొంచెం మార్చుతుంటారంతే.  నేను, నా వైఫ్‌ జనసేన వీర మహిళలు కలిసి ప్రతి ఏరియా తిరుగుతున్నాం. ప్రతి చోట అపరిశుభ్రత వాతావరణం. క్లిన్  నెస్ అనేదే లేదు.అడుగుపెట్టలేని విధంగా ఉందని చెప్పాడు 

అలాగే నటుడు  గౌతమ్ రాజు మీద కూడా తన దైన శైలి లో విమర్శల బాణాన్ని గుచ్చాడు.  గౌతమ్ రాజు  వైసీపీ కండువా కప్పుకున్నాడు. పాపం వాడికి తెలియడం లేదు అనుభవంతో చెప్తున్నా. పదేళ్లు కాపురం చేశాను. అదో టెర్రరిస్ట్ శిక్షణా శిబిరం. ఆ మొగుడుతో పడలేక  బయటకు వచ్చాను. నువ్వు మినిస్టర్ అయిపోతావ్ నీకే సినిమాటోగ్రఫీ అని అనేసరికి మనం ఎక్కడో ఉంటాం. అదంతా భ్రమ. ఏమీ ఉండదు. బటన్లు కూడా భ్రమే.  అప్పులు చేసి బటన్లు నొక్కుతున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు

 


 

యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. పదేళ్ల కాపురం నాది