English | Telugu
బిజెపిలో చేరబోతున్నానా!..నేను ఎవర్నో తెలిసింది
Updated : Apr 30, 2025
విక్టరీ వెంకటేష్(Venkatesh)నుంచి వచ్చిన అనేక హిట్ చిత్రాల్లో 'ప్రేమంటే ఇదేరా' కూడా ఒకటి. 1998 వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైన ప్రీతీ జింటా(Preity Zinta)మహేష్ బాబు(Mahesh babu)తో 'రాజకుమారుడు'లో కూడా జత కట్టి 'గోల్డెన్ లెగ్'(Golden Leg)అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి చిత్రాల్లో కనిపించలేదు. బాలీవుడ్(Bollywood)లో మాత్రం అగ్ర హీరోలందరితో భారీ సినిమాలు చేసి అభిమానుల్ని, ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్ గా ఉంటు అభిమానులు అడిగే పలు ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంటుంది.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ఒక యూజర్ 'ఎక్స్ 'వేదికగా ప్రీతీ జింటాతో మీరు భవిష్యత్తులో బిజెపీ(Bjp)లో చేరబోతున్నారా అనే ప్రశ్న వేసాడు. ఆ వ్యాఖ్యలపై ప్రీతిజింటా స్పందిస్తు సోషల్ మీడియా ప్రజలతో ఇదే సమస్య. ఈ మధ్య ఎవరు ఉహించుకుంది వాళ్లే చెప్పేస్తున్నారు. గతంలోనే చెప్పినట్టుగా 'నేను ఎవరు,నా గుర్తింపు ఏంటని తెలుసుకోవడానికే 'మహాకుంభమేళా'కి వెళ్ళాను. అంతే కానీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని, బిజెపి లో చేరుతున్నానని కాదు. విదేశాల్లో ఉండటం వల్ల నా దేశం విలువ నాకు తెలిసింది. అందరి లాగే నేను భారతదేశ సంస్కృతిని, భారతీయుల్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది.
హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ప్రీతిజింటా 2016 లో అమెరికా(America)కి చెందిన 'జీన్ గుడ్ ఎనఫ్'(Gene Goodenough)ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయ్యింది. వారిద్దరి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ప్రీతి జింటా ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ లో పంజాబ్(Punjab)జట్టుకి యజమానురాలిగా కొనసాగుతుంది.
